Revanth Reddy: రాష్ట్ర విపత్తు నిర్వహణ దళంను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy launches SDRF
షార్ట్స్‌లో చూడండి
ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రాష్ట్ర విపత్తు నిర్వహణ దళంను (ఎస్‌డీఆర్ఎఫ్) ప్రారంభించారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హోంశాఖ వేడుకలను నిర్వహించింది. ఈ క్రమంలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో దాదాపు రెండు వేల మంది సిబ్బందితో ఎస్‌డీఆర్ఎఫ్‌ను ఏర్పాటు చేశారు. రాష్ట్ర విపత్తు దళానికి చెందిన బోట్స్‌ను కూడా సీఎం ప్రారంభించారు. 

భారీ అగ్నిప్రమాదాలు, భూకంపం, వరదలు వంటి విపత్తులు సంభవించినప్పుడు ఈ దళం అత్యవసర సహాయక చర్యలు చేపట్టనుంది. అగ్నిమాపక కేంద్రాలు ఇక నుంచి ఎస్‌డీఆర్ఎఫ్ స్టేషన్లుగా రూపాంతరం చెందనున్నాయి.

జులై, ఆగస్ట్ నెలల్లో భారీ వర్షాలు కురవడంతో హైదరాబాద్, ఖమ్మం సహా పలు ప్రాంతాలు నీట మునిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి... ఎన్‌డీఆర్ఎఫ్ (NDRF) తరహాలో సుశిక్షితులైన దళం అవసరమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ క్రమంలో ఎస్‌డీఆర్ఎఫ్‌ (SDRF)ను ఏర్పాటు చేయడంతో పాటు దీనిని ఆధునికీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.35.03 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో ఆధునాతన పరికరాలు, కొత్త అగ్నిమాపక వాహనాలను కొనుగోలు చేసి సిబ్బందికి ఎస్‌డీఆర్ఎఫ్ ప్రాథమిక కోర్సులో శిక్షణ ఇప్పించారు.
Go Back to Shorts
Revanth Reddy
Congress
SDRF
Telangana
NDRF

More Telugu News