లోటస్‌పాండ్‌లో ఎకరం భూమి కబ్జాకు ప్రయత్నిస్తే అడ్డుకున్నాం: హైడ్రా కమిషనర్ కీలక వ్యాఖ్యలు
- అన్ని పార్టీలకు చెందిన వారు ఆక్రమణలకు పాల్పడ్డారని వ్యాఖ్య
- త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ రాబోతుందన్న కమిషనర్
- ఆక్రమణదారుల్లో పేదల కంటే ధనికులే ఎక్కువగా ఉన్నారని వెల్లడి
త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ రాబోతుందని వెల్లడించారు. ఎక్కువగా సంపన్నులే ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. వివిధ ప్రాంతాల్లో పరిశీలించాక తెలిసిందేమంటే ఆక్రమణలకు గురైన స్థలాల్లో పేదల కంటే ధనికులే ఎక్కువగా ఉన్నారన్నారు. హైడ్రాకు వచ్చే ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రభుత్వ స్థలాలను, చెరువులను ఆక్రమిస్తే ఎవరినీ వదిలేది లేదని తేల్చి చెప్పారు.