Nbk109: సంక్రాంతి బరిలో నందమూరి బాలకృష్ణ

Nandamuri Balakrishna in Sankranti race
షార్ట్స్‌లో చూడండి
సంక్రాంతి సీజన్‌ అంటేనే సినిమాల పండగ. ప్రతి కథానాయకుడు అవకాశాన్ని బట్టి తమ సినిమాను సంక్రాంతి బరిలో నిలపడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇక ఈ వరుసలోనే నందమూరి బాలకృష్ణ కూడా ప్రతి ఏడాది సంక్రాంతి బరిలో తన సినిమా ఉండాలని కోరుకుంటారు. ప్రస్తుతం ఆయన బాబీ దర్శకత్వంలో నటిస్తున్న 'ఎన్‌బీకే 109' చిత్రం 2025 సంక్రాంతి బరిలో నిలవనుంది. 

మేకర్స్‌ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే రామ్‌చరణ్‌, శంకర్‌ కలయికలో 'దిల్‌'రాజు నిర్మిస్తున్న 'గేమ్‌ ఛేంజర్‌'తో పాటు 'దిల్‌'రాజు వెంకటేష్‌- అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో నిర్మిస్తున్న మరో చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం' కూడా సంక్రాంతి పోటీలో ఉన్న సంగతి తెలిసిందే.  కాగా బాలకృష్ణ తాజా చిత్రం నుంచి ఇటీవల విడుదలైన పోస్టర్లు, యాక్షన్‌ గ్లింప్స్‌లు నందమూరి అభిమానులను ఆకట్టుకున్నాయి. 

ఇక, ఈ నెల 15న ఈ చిత్రం టైటిల్‌ టీజర్‌ను విడుదల చేస్తున్నట్లుగా నిర్మాత ప్రకటించారు.  ఈ సందర్భంగా విడుదల చేసిన బాలకృష్ణ పోస్టర్ ఆకట్టుకుంటోంది.  డిఫరెంట్‌ కాస్ట్యూమ్స్‌తో కనిపిస్తూ ప్రత్యేకమైన ఆయుధాలను చేతబట్టి సమరానికి సిద్ధంగా ఉన్న బాలకృష్ణ లుక్ ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. 

చేతిలో గొడ్డలితో... లాంగ్‌ హెయిర్‌తో... గుబురు గడ్డంతో బాలకృష్ణ పూర్తి రూపం కనిపించీ కనిపించనట్టుగా ఉండటంతో అందరిలోనూ క్యూరియాసిటీని పెంచింది. బాలీవుడ్‌ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తమన్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి విజయ్‌ కార్తీక్‌ కన్నన్‌ కెమెరామెన్‌గా  ఉన్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Go Back to Shorts
Nbk109
Bobby
Nandamuri Balakrishna
Nbk109 update
Nbk title teaser
Naga vamsi
Cinema

More Telugu News