నిన్న అజిత్.. నేడు కమల హాసన్.. వెంటనే ఆ ట్యాగ్ తొలగించాలని విన్నపం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నిన్న అజిత్.. నేడు కమల హాసన్.. వెంటనే ఆ ట్యాగ్ తొలగించాలని విన్నపం

Kamal Haasan Requests Fans To Remove His Prefix
  • తనను ఉలగనాయగన్, ఆండవర్ అని పిలవడం మానేయాలని కమల్ విజ్ఞప్తి
  • ఇకపై కమల్, లేదంటే కమలహాసన్ అని మాత్రమే పిలవాలని విన్నపం
  • గతంలో అజిత్ కూడా ఇలాగే అభ్యర్థించిన వైనం
ప్రముఖ నటుడు కమలహాసన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తన పేరుకు ముందు స్టార్ ట్యాగ్స్ తగిలించవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. కమల్‌ను ఆయన అభిమానులు ‘ఉలగనాయగన్’, ‘ఆండవర్’ అని పిలుచుకుంటూ ఉంటారు. అయితే, ఇకపై తన పేరుకు ముందు ఎలాంటి ట్యాగులు తగిలించవద్దని, కమల్ లేదంటే కమల హాసన్ అని మాత్రమే పిలవాలని అభిమానులు, మీడియా, సినీ పరిశ్రమ, క్యాడర్‌కు విజ్ఞప్తి చేస్తూ ఎక్స్‌లో నోట్ విడుదల చేశాడు.

గతంలో నటుడు అజిత్ కుమార్ కూడా ఇలాంటి విన్నపమే చేశాడు. తన పేరకు ముందు ‘తలా’ అని కానీ, మరే స్టార్ ట్యాగ్ తగిలించవద్దని కోరాడు. అజిత్, అజిత్ కుమార్, లేదంటే ఏకే అని మాత్రమే సంబోధించాలని విజ్ఞప్తి చేశాడు.
Advertisement
Kamal Haasan
Kollywood
Ulaganayagan
Aandavar

More Telugu News