ఖండాంతరాలు దాటిన ప్రేమ... పెళ్లి బంధంతో ఒక్కటి
- కెనడా అమ్మాయితో అమలపురం అబ్బాయి పెళ్లి
- 14 ఏళ్ల క్రితం ఉన్నత విద్య కోసం కెనడా వెళ్లిన మనోజ్ కుమార్
- అక్కడే బ్యాంకు ఉద్యోగం సంపాదించి స్థిరపడిన వైనం
- ఈ క్రమంలో కెనడా అమ్మాయి ట్రేసి రోచే డాన్‌తో ప్రేమాయణం
- ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటి
ఈ క్రమంలో మనోజ్ కుమార్‌కు కెనడా అమ్మాయి ట్రేసి రోచే డాన్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా తర్వాత ప్రేమగా మారింది. దాంతో గత ఏడేళ్లుగా ఈ జంట ప్రేమలో ఉన్నారు. పెద్దలను ఒప్పించి కెన్యాలో నిశ్చితార్థం చేసుకున్నారు. అనంతరం కెనడా సాంప్రదాయం ప్రకారం వివాహబంధంతో ఒక్కటయ్యారు.
ఇటు హిందూ సాంప్రదాయంలో పెళ్లి చేసుకోవాలని ఈ జంట ఈదరపల్లిలోని స్వగృహానికి వచ్చింది. తాజాగా వీరి హల్దీ ఫంక్షన్ ఘనంగా జరిగింది. ఈ వారంలో మలికిపురం మండలం దిండిలో హిందూ సాంప్రదాయం ప్రకారం తాము పెళ్లి చేసుకుని, ఆపై రిసెప్షన్ నిర్వహిస్తామని మనోజ్ కుమార్ చెప్పుకొచ్చాడు.