బాలీవుడ్‌లో వార్‌కు సిద్దమైన ఎన్టీఆర్
- వార్-2 షూటింగ్ కోసం ముంబై బయలుదేరిన ఎన్టీఆర్
- ఎన్టీఆర్ నటిస్తున్న తొలి బాలీవుడ్ చిత్రమిది
- వచ్చే ఏడాది ప్రారంభంలో వార్-2 రిలీజ్‌కు సన్నాహాలు
ఇప్పుడు ఈ విజయం ఉత్సాహాంలో వున్న ఎన్టీఆర్ తన బాలీవుడ్‌లో నటిస్తున్న తొలిచిత్రం వార్-2 చిత్రం షూటింగ్‌లో పాల్గొనడానికి శనివారం ముంబైకి బయలుదేరాడు. ఇంతకు ముందు ఎన్టీఆర్ ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొన్నాడు. అయితే చాలా కాలం విరామం తరువాత ఇటీవల వార్-2 షూటింగ్ మళ్లీ మొదలైంది. తాజాగా ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన సన్నివేశాలు కూడా చిత్రీకరించడానికి యూనిట్ రెడీగా వుండటంతో ఎన్టీఆర్ ముంబై వెళ్లారు.
బాలీవుడ్‌లో రూపొంది ఘనవిజయం సాధించిన వార్ చిత్రానికి సీక్వెల్ వార్-2 తెరకెక్కుతోంది. మొదటిభాగంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించారు. ఇప్పుడు సీక్వెల్‌లో టైగర్ ష్రాఫ్ స్థానంలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ తొలి కలయికలో ఈ చిత్రం రూపొందుతోంది. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రెడీ అవుతున్న వార్-2 చిత్రాన్ని 2025 ప్రారంభంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.