రోహిత్ శర్మ, కోహ్లీలను కలిసిన మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్.. వైరల్ వీడియో ఇదిగో
- భారత్ - న్యూజిలాండ్ మధ్య బెంగళూరులో బుధవారం తొలి టెస్ట్ మ్యాచ్
- చిన్నస్వామి స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న స్టార్ ఆటగాళ్ల వద్దకు మాజీ కోచ్
- ప్లేయర్స్‌తో సరదాగా ముచ్చటించిన రాహుల్ ద్రావిడ్
కాగా భారత్ - న్యూజిలాండ్ మధ్య బుధవారం తొలి టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ సిరీస్ కోసం కెప్టెన్ రోహిత్ నాయకత్వంలోని జట్టు సన్నద్దమవుతోంది. మూడు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు ఇప్పటికే భారత్ చేరుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టింది. కాగా భారత పర్యటనకు ముందు న్యూజిలాండ్.. శ్రీలంక పర్యటనకు వెళ్లింది. అక్కడ 2-0 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది. దీనికి బాధ్యత వహిస్తూ కెప్టెన్సీ బాధ్యతల నుంచి స్టార్ ప్లేయర్ సౌతీ వైదొలిగాడు. దీంతో టామ్ లాథమ్ న్యూజిలాండ్‌కు నాయకత్వం వహించనున్నాడు.