బాలకృష్ణ కాళ్లకు నమస్కరించిన ఐశ్వర్యరాయ్.. వైరల్ వీడియో ఇదిగో!
- అబుధాబిలో జరిగిన ఐఫా వేడుకలో ఘటన
- పొన్నియన్ సెల్వన్‌లో నటనకు గాను ఉత్తమ నటి అవార్డుకు ఎంపికైన ఐశ్వర్యరాయ్
- అవార్డు అందుకోవడానికి ముందు బాలయ్య పాదాలను తాకి నమస్కారం
మణిరత్నం, సమంత, చిరంజీవి, బాలకృష్ణ, రానా దగ్గుబాటి, వెంకటేశ్, ఐశ్వర్యాయ్, షాహిద్ కపూర్, అనన్య పాండే, కృతి సనన్, కరణ్ జోహార్, జావేద్ అక్తర్, షబానా ఆజ్మీ వంటివారు హాజరై వేడుకకు గ్లామర్‌ను జోడించారు.
తమిళ సినిమా పొన్నియన్ సెల్వన్‌లో నటనకు గాను ఉత్తమ నటి అవార్డును బాలయ్య చేతుల మీదుగా అందుకునేందుకు స్టేజిపైకి వచ్చిన ఐశ్వర్యరాయ్ తొలుత బాలయ్య పాదాలకు నమస్కరించారు. బాలయ్య ఆమె తలపై చెయ్యిపెట్టి ఆశీర్వదించారు. ఆ తర్వాతే ఐశ్వర్య అవార్డు అందుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను బాలయ్య అభిమానులు షేర్ చేస్తూ మురిసిపోవడంతోపాటు ఐశ్వర్య సింప్లిసిటీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. గొప్ప నటి అయినప్పటికీ ఆమె తన ప్రవర్తనతో మరింత గొప్పగా ఎదిగారని కొనియాడుతున్నారు.