మెగాస్టార్ చిరంజీవి కంటే ముందు గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కిన టాలీవుడ్ ప్రముఖులు వీరే!
- ఇటీవలే గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన చిరంజీవి
- 156 సినిమాలు, 537 పాటలు, 24 వేల స్టెప్పులతో మెగాస్టార్ రికార్డ్
- ఇప్పటికే గిన్నిస్ రికార్డులు సాధించిన దాసరి, ఎస్పీ బాలు, రామానాయుడు తదితరులు
గిన్నిస్ రికార్డులు సాధించిన టాలీవుడ్ ప్రముఖులు:
దాసరి నారాయణరావు: తెలుగు, తమిళం, హిందీ భాషల్లో 150కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ రికార్డు సాధించారు. 53 సినిమాలను స్వయంగా నిర్మించిన ఘనత కూడా ఆయనది.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం: తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠా భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడి రికార్డు సృష్టించారు.
దగ్గుబాటి రామానాయుడు: 100కు పైగా చిత్రాలను నిర్మించి గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించారు.
విజయనిర్మల: 200కు పైగా చిత్రాల్లో నటించిన విజయనిర్మల డైరెక్టర్ గా 44 సినిమాలను తెరకెక్కించారు. ప్రపంచంలో అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళగా ఆమె గిన్నిస్ రికార్డును సాధించారు.
పి. సుశీల: సుశీల 12 భాషల్లో దాదాపు 30 వేల పాటలు పాడినట్టు అంచనా.. అయితే గిన్నిస్ బుక్ వారు 1960 నుంచి 6కు పైగా భాషల్లో 17,695 సోలో, డ్యూయట్, కోరస్ పాటలను పరిగణనలోకి తీసుకుని ఆమెను గిన్నిస్ రికార్డుల్లోకి చేర్చారు.
బ్రహ్మానందం: ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ఒకే భాషలో 754 చిత్రాలలో నటించినందుకు గాను ఆయనను గిన్నిస్ రికార్డు వరించింది.