రేవంత్ రెడ్డిని కలిసిన మహేశ్ బాబు, నమ్రత.. వీడియో ఇదిగో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రేవంత్ రెడ్డిని కలిసిన మహేశ్ బాబు, నమ్రత.. వీడియో ఇదిగో!

Mahesh Babu and Namrata meets Revanth Reddy
  • జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసానికి వెళ్లిన మహేశ్ బాబు దంపతులు
  • మహేశ్, నమ్రతలను సాదరంగా ఆహ్వానించిన సీఎం
  • వరద బాధితుల సహాయార్థం రూ. 50 లక్షల చెక్ ను అందించిన మహేశ్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఆయన భార్య నమ్రత శిరోద్కర్ కలిశారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసానికి వారు వెళ్లారు. తన ఇంటికి వచ్చిన మహేశ్ దంపతులను రేవంత్ సాదరంగా స్వాగతించారు. మహేశ్ కు శాలువా కప్పారు. మహేశ్ దంపతులకు పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా తెలంగాణ వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీ విరాళాన్ని మహేశ్ అందించారు. రూ. 50 లక్షల చెక్ ను సీఎంకు అందజేశారు. ఏఎంబీ సినిమాస్ తరపున మరో రూ. 10 లక్షలను అందించారు. వరద బాధితులకు అండగా నిలిచి విరాళం అందించిన మహేశ్ కు ఈ సందర్భంగా సీఎం రేవంత్ అభినందనలు తెలిపారు.

Advertisement
Mahesh Babu
Tollywood
Revanth Reddy
Congress

More Telugu News