ఓ దర్శకుడు 'కమిట్ మెంట్' అడిగాడన్న నటి కస్తూరి

kasthuri reveaks her casting couch experiences
  • సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న జస్టిస్ హేమ కమిటీ నివేదిక ప్రకంపనలు
  • ఇండస్ట్రీలో కమిట్‌మెంట్ వ్యవహారాలపై తాజాగా కామెంట్స్ చేసిన నటి కస్తూరి
  • తాను బాధితురాలినేనని వెల్లడించిన కస్తూరి
  • సినిమాల్లోకి రావాలనుకున్న అమ్మాయిలు ధైర్యంగా, చాలా జాగ్రత్తగా ఉండాలని సూచన
కేరళ చిత్ర పరిశ్రమలో జస్టిస్ హేమ కమిటీ నివేదిక తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ నివేదిక బయటకు వచ్చిన తర్వాత అనేక మంది హీరోయిన్‌లు ఇండస్ట్రీలో గతంలో వారు ఎదుర్కొన్న లైంగిక వేధింపులను, చేదు అనుభవాలను మీడియా ముందు బహిర్గతం చేస్తూ వస్తున్నారు. తాజాగా నటి కస్తూరి కూడా తాను ఎదుర్కొన్న అనుభవాన్ని వెల్లడించారు. తన రెండో సినిమాలోనే దర్శకుడు తనను కమిట్మెంట్ అడిగారని చెప్పడం తీవ్ర సంచలనం అయింది.  

ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కస్తూరి మాట్లాడుతూ ... తాను నటించిన రెండో సినిమా దర్శకుడు తనతో అనుచితంగా మాట్లాడి కమిట్‌మెంట్ కావాలని, అడ్జస్ట్‌మెంట్ చేసుకోమని అడిగాడని చెప్పింది. అతని ఉద్దేశం అర్థమై షూటింగ్ స్పాట్ లోనే అందరి ముందు తిట్టానని చెప్పింది. తాను అతనికి సహకరించలేదు కాబట్టి సినిమా మొదటి దశ పూర్తయిన తర్వాత తనను సినిమా నుండి తప్పించారని వెల్లడించింది. ఫస్ట్ ఫేజ్ షూటింగ్ అయ్యాక తాను సన్నగా ఉన్నానన్న కారణంతో తప్పించారని చెప్పింది. తాను ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయినని, తన తల్లి న్యాయవాది అనీ.. తనకే చిత్ర పరిశ్రమలో ఇలాంటి సంఘటనలు జరిగాయని తెలిపింది. 

సినిమాలపై ఆధారపడి జీవనోపాధి కోసం కొందరు మహిళలు ఇక్కడికి వస్తుంటారని, అలాంటి వారు అమ్మాయిలను ఎలా తయారు చేస్తారో ఆలోచించుకోవాలని అన్నారు. ఏమైనా సినిమాల్లోకి రావాలనుకునే అమ్మాయిలు ధైర్యంగా, చాలా జాగ్రత్తగా ఉండాలని కస్తూరి సూచించారు. కాగా, మోడలింగ్ రంగం నుండి సినిమాల్లోకి వచ్చిన కస్తూరి .. తమిళ, మలయాళ, తెలుగు, కన్నడ భాషల సినిమాల్లో నటించారు. గృహలక్ష్మి అనే సీరియల్‌తో తెలుగు ప్రజలకు సుపరిచితురాలయింది. ఈ సీరియల్ ద్వారా బాగా పాప్యులర్ అయిన కస్తూరికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇండస్ట్రీలో జరిగే చీకటి బాగోతాలపై నటి కస్తూరి కూడా మాట్లాడటం సంచలనం అయింది. 
Go Back to Shorts
Actress Kasthuri
Movie News
Casting Couch

More Telugu News