రేపు మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రేపు మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

PM Modi will inaugurates three Vande Bharat trains tomorrow
ప్రధాని నరేంద్ర మోదీ రేపు (ఆగస్టు 31) మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. మీరట్-లక్నో (ఉత్తరప్రదేశ్), మధురై-బెంగళూరు (కర్ణాటక), చెన్నై-నాగర్ కోయిల్ (తమిళనాడు) మార్గాల్లో ఈ కొత్త వందే భారత్ రైళ్లు పరుగులు తీయనున్నాయి. 

స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీతో అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో తీర్చిదిద్దిన ఈ నూతన వందే భారత్ రైళ్లు మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కార్యాచరణకు ప్రతీకలుగా నిలుస్తాయని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ మూడు వందే భారత్ రైళ్లు ఆయా మార్గాల్లో ప్రయాణ సమయాన్ని గంటన్నర నుంచి రెండు గంటల వరకు తగ్గించనున్నాయి.
Advertisement
Vande Bharat Trains
Narendra Modi
Inauguration

More Telugu News