B Gopal: నా జీవితంలో అదే పెద్ద లోటు: డైరెక్టర్ బి. గోపాల్!

B Gopal Interview
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ సీనియర్ దర్శకులలో బి. గోపాల్ ఒకరు. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే బి. గోపాల్, ఎన్నో భారీ విజయాలను అందుకున్నారు. బొబ్బిలిరాజా .. అసెంబ్లీ రౌడీ .. ఇంద్ర వంటి సంచలన విజయాలు ఆయన ఖాతాలో కనిపిస్తాయి. ఇక ఆయన బాలకృష్ణతో చేసిన సమరసింహా రెడ్డి .. నరసింహా నాయుడు కొత్త రికార్డులను సెట్ చేసి పెట్టాయి.

 అలాంటి ఆయన 'ట్రీ మీడియా'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీ రామారావు గురించి ప్రస్తావించారు."నా అభిమాన నటుడు ఎన్టీ రామారావుగారు. చిన్నప్పుడు నేల టిక్కెట్టు కొనుక్కుని ఆయన సినిమాలు చూసేవాడిని. అలాంటి నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆయన 8 సినిమాలకు పనిచేశాను. షూటింగు జరుగుతున్నంత సేపు రామారావుగారిని అలా చూస్తూ కూర్చుండి పోయేవాడిని" అని అన్నారు. 

 రామారావుగారితో సినిమాలు చేస్తున్నప్పుడు, రోజంతా ఆయనతో ఉండటం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చేది. దర్శకుడిగా మాత్రం రామారావుగారితో చేయలేకపోయాను. నా జీవితంలో అదే పెద్ద లోటుగా అనిపిస్తూ ఉంటుంది. నా అదృష్టం ఏమిటంటే హీరోలంతా నన్ను ఎంతో అభిమానంతో చూసుకునేవారు. నా జర్నీ నాకు సంతృప్తిని ఇస్తుంది" అని చెప్పారు. 


Go Back to Shorts
B Gopal
N T RamaRao
Balakrishna

More Telugu News