Kodandaram: వ్యక్తిగత భద్రతను నిరాకరించిన ఎమ్మెల్సీ కోదండరాం

MLC Kodandaram rejected personal security
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరాం తనకు వ్యక్తిగత భద్రతను నిరాకరించారు. ఇటీవల గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రభుత్వం సెక్యూరిటీని కేటాయించింది. అయితే తనకు కేటాయించిన సెక్యూరిటీని ఆయన నిరాకరించారు.

తాను ప్రజల మనిషినని... వ్యక్తిగత భద్రత అవసరం లేదన్నారు. సెక్యూరిటీ ఉంటే ప్రజలతో సత్సంబంధాలు దెబ్బతినే అవకాశాలు ఉంటాయన్నారు. సెక్యూరిటీ లేకుంటేనే ప్రజలు తమ సమస్యలను స్వేచ్ఛగా తెలిపే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. భద్రతా సిబ్బంది ఉంటే ప్రజలు తన వద్దకు రాకుండా నిలువరిస్తారన్నారు.
Go Back to Shorts
Kodandaram
Telangana
Congress
Security

More Telugu News