తనయుడు, సోదరుడితో కలిసి శబరిమల అయ్యప్ప దర్శనానికి పెద్దిరెడ్డి... వీడియో ఇదిగో!

Peddireddy at sabarimala along with son and brother
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి బయల్దేరారు. తనయుడు మిథున్ రెడ్డి, సోదరుడు ద్వారకానాథరెడ్డితో కలిసి ఈ ఉదయం కేరళలోని పంబ నుంచి శబరిమల కొండ పైకి పయనమయ్యారు.

కాషాయ దుస్తుల్లో ఉన్న పెద్దిరెడ్డి తలపై ఇరుముడితో నడుస్తుండగా, పక్కనే మిథున్ రెడ్డి, వెనుకగా ద్వారకానాథరెడ్డి అనుసరించారు. ఈ విషయాన్ని పెద్దిరెడ్డి తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించారు. వీడియోను కూడా పంచుకున్నారు. 

ఇటీవల ఎన్నికల్లో వైసీపీకి 11 ఎమ్మెల్యే స్థానాలు, 4 ఎంపీ స్థానాలు రాగా... పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి, తంబళ్లపల్లె నుంచి ఆయన సోదరుడు ద్వారకానాథరెడ్డి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీగా గెలిచారు.
Go Back to Shorts
Peddireddi Ramachandra Reddy
Ayyappa
Sabarimala
Mithun Reddy
Dwarakanatha Reddy

More Telugu News