కొత్త ఆర్టీసీ బస్సు నడిపిన బాలయ్య... వీడియో ఇదిగో!
Add ap7am to your home Screen

కొత్త ఆర్టీసీ బస్సు నడిపిన బాలయ్య... వీడియో ఇదిగో!

Balayya drove the new RTC bus
  • హిందూపురం ఆర్టీసీ డిపోకు కొత్త బస్సుల మంజూరు
  • కొత్త బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ
  • స్వయంగా బస్సు నడిపి కార్యకర్తల్లో జోష్ నింపిన బాలయ్య
నందమూరి బాలకృష్ణ ఒక పక్క ప్రజా ప్రతినిధిగా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటూనే మరో పక్క సినీమా షూటింగ్ లలోనూ బిజీబిజీగా గడుపుతూ ఉంటారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. బాలయ్య వరుసగా మూడోసారి హిందూపురం నుండి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. బాలయ్య కొంత సమయాన్ని రాజకీయాలకు, మరికొంత సమయాన్ని సినిమాలకు కేటాయిస్తూ ఎప్పుడూ బిజీగానే ఉంటుంటారు. అయితే తాజాగా ఆయన హిందూపురంలో సుడిగాలి పర్యటన చేశారు.  ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
 
ఈ క్రమంలో భాగంగా హిందూపురంలో కొత్త ఆర్టీసీ బస్సులను ఎమ్మెల్యే బాలయ్య ప్రారంభించారు. అటు సినిమాల్లో, ఇటు నిజ జీవితంలో ఏ వాహనాన్ని అయినా నడిపే బాలయ్య .. బస్సు ప్రారంభోత్సవం సందర్భంగా స్టీరింగ్ పట్టి బస్సును కొద్ది దూరం నడిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తమ సమక్షంలో బాలకృష్ణ నేరుగా బస్సు డ్రైవింగ్ చేయడంతో అధికార యంత్రాంగం, తెలుగు తమ్ముళ్లు సంతోషం వ్యక్తం చేశారు. తమ ప్రాంతానికి కొత్త బస్సులు రావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సవిత కూడా పాల్గొన్నారు.
Advertisement
Balakrishna
MLA
Hindupuram

More Telugu News