భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 693 పాయింట్ల నష్టాల్లో ముగిసిన సెన్సెక్స్
- 208 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
- నష్టాల్లో ముగిసిన 2,322 స్టాక్స్... లాభాల్లో ముగిసిన 1,103 స్టాక్స్
టాప్ గెయినర్స్ జాబితాలో టైటాన్ కంపెనీ, అపోలో హాస్పిటల్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టాటా కన్స్యూమర్స్, హెచ్‌సీఎల్ టెక్ ఉండగా, టాప్ లూజర్స్ జబితాలో శ్రీరామ్ ఫైనాన్స్, బీపీసీఎల్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి. బ్యాంకింగ్, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, మెడల్, మీడియా, టెలికం ఇలా అన్ని రంగాలు కూడా ఒక శాతం వరకు నష్టాల్లో ముగిశాయి.
ఇంట్రాడే ట్రేడింగ్‌లో బ్యాంకుల షేర్లు ఇండెక్స్‌లపై ప్రభావం చూపడంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లిమిటెడ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యధికంగా నష్టపోయాయి. టాప్ 10 అత్యంత విలువైన సంస్థల మార్కెట్ వ్యాల్యూ మంగళవారం రూ.62,042.2 కోట్లు తగ్గింది.