మీరు చూపిన ప్రేమ‌కు థ్యాంక్స్‌: మ‌హేశ్ బాబు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మీరు చూపిన ప్రేమ‌కు థ్యాంక్స్‌: మ‌హేశ్ బాబు

Mahesh Babu Special Thanks to All who Wish him on his Birthday
  • నిన్న మ‌హేశ్‌బాబు పుట్టిన‌రోజు కావ‌డంతో వెల్లువెత్తిన బ‌ర్త్ డే విషెస్
  • శుభాకాంక్ష‌లు చెప్పిన వారికి 'ఎక్స్' వేదిక‌గా ప్రిన్స్ ధ‌న్య‌వాదాలు 
  • త‌న బ‌ర్త్ డేను ప్ర‌త్యేకంగా, చిర‌స్మ‌ర‌ణీయంగా మార్చారంటూ హ‌ర్షం
శుక్ర‌వారం సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు పుట్టిన‌రోజు కావ‌డంతో ఆయ‌న‌కు బ‌ర్త్ డే విషెస్ వెల్లువెత్తాయి. సినీ, వివిధ రంగాల‌కు చెందిన ప్రముఖులు, అభిమానులు ఆయ‌న‌కు సోష‌ల్ మీడియా ద్వారా పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఇలా బ‌ర్త్ డే సంద‌ర్భంగా త‌న‌పై చూపిన ప్రేమ‌కు తాజాగా ప్రిన్స్ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలిపారు. 

"మీరు చూపిన ప్రేమ‌, పంపిన సందేశాలు, ఆశీస్సులకు నేను ఎంతో పొంగిపోయాను. నా బ‌ర్త్ డేను మీరంతా ప్ర‌త్యేకంగా, చిర‌స్మ‌ర‌ణీయంగా మార్చారు. ఎల్ల‌ప్పుడూ మీరు నాకు ఇచ్చే మ‌ద్ద‌తు, చూపే ప్రేమ‌కు కృత‌జ్క్ష‌త‌లు. ల‌వ్ యూ ఆల్" అంటూ ప్రిన్స్ ట్వీట్ చేశారు. ఇప్పుడీ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఆయ‌న అభిమానులు ఈ ట్వీట్‌ను తెగ షేర్ చేస్తున్నారు. 

ఇక మ‌హేశ్ బాబు సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం ఆయ‌న ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళితో మూవీకి రెడీ అవుతున్నారు. త్వ‌ర‌లోనే ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌నుంద‌ని స‌మాచారం. ఈ చిత్రం యాక్ష‌న్ అడ్వెంచ‌ర్‌గా ఉంటుంద‌ని కథా ర‌చ‌యిత విజయేంద్ర‌ప్ర‌సాద్ ఇప్ప‌టికే వెల్ల‌డించారు. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాలో హాలీవుడ్ టెక్నీషియ‌న్స్ కూడా భాగం కానున్నారు.
Advertisement
Mahesh Babu
Birthday Wishes
Tollywood
Twitter

More Telugu News