జూబ్లీహిల్స్‌లో మురుగు నీటి సమస్యపై హీరో రాజశేఖర్ ట్వీట్

Hero Rajasekhar tweet about  drainage leak at Ashwini heights
  • రోడ్డు నెంబర్ 70లో మురుగునీటి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి
  • జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేసినప్పటికీ పరిష్కారం కాలేదన్న రాజశేఖర్
  • సమస్యను పరిష్కరించాలంటూ ట్వీట్
హైదరాబాద్‌లోని జుబ్లీహిల్స్‌లోని రోడ్డు నెంబర్ 70లో మురుగు నీటి సమస్యను పరిష్కరించాలని సినీ నటుడు రాజశేఖర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఇక్కడి అశ్వినీ హైట్స్ నుంచి డ్రైనేజీ లీకేజీ సమస్య ఎప్పటి నుంచో వేధిస్తోందని పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని తాము జీహెచ్ఎంసీకి ఎప్పుడో ఫిర్యాదు చేశామని, కానీ ఇప్పటి వరకు సమస్య పరిష్కారం కాలేదని పేర్కొన్నారు.

ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ ఆన్‌లైన్‌లను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ట్వీట్ చేశారు.
Advertisement
Rajasekhar
Tollywood
GHMC
Telangana

More Telugu News