హైదరాబాద్‌లో కొత్త వైరస్... తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
- ఎక్స్ వేదికగా భాగ్యనగరవాసులను అప్రమత్తం చేసిన జీహెచ్ఎంసీ
- నోరో వైరస్ వ్యాధి కలుషిత నీరు, ఆహారంతో వ్యాపిస్తుందని హెచ్చరిక
- చేతులు సబ్బుతో కడుక్కోవడం, కాచి చల్లార్చిన నీరు తాగడం చేయాలని సూచన
'నోరో వైరస్ వ్యాధితో జాగ్రత్త!! కలుషిత నీరు, ఆహారం కారణంగా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.' అని పేర్కొంది. చలిజ్వరం, వాంతులు, విరేచనాలు, నీరసం, కడుపు నొప్పి, డీహైడ్రేషన్ ఈ నోరో వైరస్ లక్షణాలు అని పేర్కొంది. ప్రస్తుతం నోరో వైరస్ కేసులు నగరంలోని యాకుత్‌పురా, మలక్ పేట, డబీర్‌పురా, పురానాహవేలీ, మొఘల్‌పురలతో పాటు పలు ప్రాంతాల్లో నమోదయ్యాయి. నోరో వైరస్ బారిన పడినవారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- చేతులను సబ్బుతో శుభ్రంగా కడగాలి.
- కాచి చల్లార్చిన, వడపోసిన నీటిని తాగాలి.
- ఇంటిని, పరిసరాలను క్రిమిసంహారక మందులతో శుభ్రం చేసుకోవాలి.