ఆరెస్సెస్‌ను చూసి నేర్చుకోవాలి: యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు దిగ్విజయ్ సింగ్ సూచన
- సందేశాన్ని ప్రభావవంతంగా ఎలా అందించాలో ఆరెస్సెస్ నుంచి నేర్చుకోవాలన్న దిగ్విజయ్
- ప్రత్యర్థులు అయినప్పటికీ ఆరెస్సెస్ నుంచి నేర్చుకోవాలని సూచన
- ఆరెస్సెస్ కార్యాచరణ, ప్రచారాన్ని అర్థం చేసుకోవడం ద్వారా దానిని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చునని వ్యాఖ్య
ప్రత్యర్థులు అయినప్పటికీ ఆరెస్సెస్ నుంచి నేర్చుకోవాలన్నారు. వారు మైండ్ గేమ్ ఆడతారని, ఎప్పుడూ నిరసనలు చేయరని... ప్రదర్శనలు నిర్వహించరని పేర్కొన్నారు. వారికి ఎప్పుడూ దెబ్బలు తగలవని, జైళ్లకు కూడా వెళ్లరన్నారు. కానీ మనల్ని జైలుకు పంపుతారని వ్యాఖ్యానించారు. ఆరెస్సెస్ కార్యాచరణ, ప్రచారాన్ని అర్థం చేసుకోవడం ద్వారా దానిని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చునన్నారు.