Revanth Reddy: రేవంత్ రెడ్డిని కలిసి టీమిండియా జెర్సీని బహూకరించిన క్రికెటర్ సిరాజ్

Cricketer Siraj gifted Team India jersy to CM Revanth Reddy
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టీమిండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ కలిశారు. టీ20 ప్రపంచ కప్ సాధించినందుకు గాను సిరాజ్‌ను ముఖ్యమంత్రి అభినందించారు. శాలువా కప్పి, పుష్పగుచ్ఛం ఇచ్చారు. ఈ సందర్భంగా టీమిండియా జెర్సీని రేవంత్ రెడ్డికి బహూకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహమ్మద్ అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

పాలమూరులో ముఖ్యమంత్రి పర్యటన

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు పాలమూరులో పర్యటించారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మహబూబ్ నగర్‌ కలెక్టరేట్ ఆలయంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ తదితరులు పాల్గొన్నారు. అనంతరం, కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
Go Back to Shorts
Revanth Reddy
Mohammad Sriraj
Team India
Cricket

More Telugu News