సీతక్కకు హోంశాఖ దక్కే ఛాన్స్... కేబినెట్లోకి రాజగోపాల్ రెడ్డి!: దామోదర రాజనర్సింహ

Damodara says Seethakka may get Home Ministry
  • త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న దామోదర
  • మంత్రివర్గంలో కొత్తగా ఐదారుగురికి చోటు దక్కవచ్చునని వెల్లడి
  • రాజగోపాల్ రెడ్డితో పాటు దానం నాగేందర్‌కు ఛాన్స్ ఉందని వెల్లడి
మంత్రి సీతక్కకు హోంశాఖ పదవి వచ్చే అవకాశముందని, అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవచ్చునని తెలంగాణ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ... త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని వెల్లడించారు.

కేబినెట్ విస్తరణతో పాటు పలువురు మంత్రుల శాఖలకు మార్పులు చేర్పులు చేసే అవకాశముందన్నారు. కొత్తగా ఐదారుగురికి మంత్రివర్గంలో చోటు దక్కవచ్చునని తెలిపారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు దానం నాగేందర్‌కు కేబినెట్లో చోటు దక్కే అవకాశముందన్నారు. నిజామాబాద్ నుంచి ఒకరికి కేబినెట్లో చోటు దక్కవచ్చునన్నారు. త్వరలో వైద్య శాఖలో ప్రక్షాళన చేస్తామన్నారు.
Go Back to Shorts
Damodara Raja Narasimha
Seethakka
Komatireddy Raj Gopal Reddy
Congress

More Telugu News