నిఖిల్ బర్త్ డే స్పెషల్ .. 'స్వయంభూ' పోస్టర్!
- నిఖిల్ హీరోగా రూపొందుతున్న 'స్వయంభూ'
- చారిత్రక నేపథ్యంలో నడిచే కథాకథనాలు
- కథానాయికగా అలరించనున్న సంయుక్తా మీనన్
- దర్శకత్వం వహించనున్న భరత్ కృష్ణమాచారి
ఈ రోజున నిఖిల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమా టీమ్ ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, కొత్త పోస్టర్ ను వదిలారు. నిఖిల్ లుక్ డిఫరెంట్ గా ఉంది .. యుద్ధరంగంలో ఆయన ఉన్నాడనే విషయం ఈ పోస్టర్ ద్వారా అర్థమవుతోంది. చారిత్రక నేపథ్యంలో ఈ కథ నడుస్తుందనే విషయం స్పష్టమవుతోంది.
ఈ సినిమా యూనిట్ కి నిఖిల్ థ్యాంక్స్ చెబుతూ, షూటింగులో ప్రతి రోజు ఎంతో ఎంజాయ్ చేస్తున్నాననీ, చాలా ఎగ్జైటింగ్ గా ఉందని సమాధానమిచ్చాడు. పిక్సెల్ స్టూడియోస్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి రవి బస్రూర్ సంగీతాన్ని సమకూర్చాడు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, కథానాయికగా సంయుక్తా మీనన్ కనిపించనుంది.