సూపర్ స్టార్ కృష్ణకు మహేశ్ బాబు ఎమోషనల్ బర్త్‌డే విషెస్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సూపర్ స్టార్ కృష్ణకు మహేశ్ బాబు ఎమోషనల్ బర్త్‌డే విషెస్

Mahesh Babu Special Birthday Wishes to Father Krishna
  • నేడు కృష్ణ 81వ పుట్టిన‌రోజు
  • 'ఎక్స్' వేదిక‌గా తండ్రికి ప్రిన్స్ పుట్టినరోజు శుభాకాంక్ష‌లు
  • 'మిమ్మ‌ల్ని చాలా మిస్ అవుతున్నా' అంటూ మ‌హేశ్ ఎమోషనల్ ట్వీట్
నేడు (శుక్ర‌వారం)  టాలీవుడ్ లెజెండరీ నటుడు కృష్ణ 81వ పుట్టిన‌రోజు. ఈ సందర్భంగా ఆయన తనయుడు, సూపర్‌ స్టార్ మ‌హేశ్ బాబు 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ప్ర‌త్యేకంగా బర్త్‌డే విషెస్ తెలియజేశారు. ''హ్యాపీ బర్త్ డే నాన్నా.  మిమ్మ‌ల్ని చాలా మిస్ అవుతున్నా. నా ప్రతి స్మృతిలో మీరు ఎప్పటికీ జీవిస్తూనే ఉంటారు! '' అంటూ ప్రిన్స్‌ ఎమోషనల్ ట్వీట్ చేశారు. దీనికి కృష్ణ పాత ఫొటోను జ‌త చేశారు.   

కాగా, 300కి పైగా చిత్రాల్లో హీరోగా నటించిన కృష్ణ‌.. తొలి జేమ్స్‌బాండ్, తొలి కౌబాయ్, తొలి ‌సినిమా స్కోప్, తొలి 70ఎమ్ఎమ్ వంటి ఎన్నో తొలి అనుభూతుల్ని తెలుగు చిత్ర పరిశ్రమకు అందించిన ఘనత ఆయనది. హీరోగానే కాదు.. దర్శకుడిగా, నిర్మాతగా టాలీవుడ్‌లో అభిమానుల గుండెల్లో ఎవర్‌గ్రీన్ స్టార్‌గా నిలిచిపోయారు. 

మ‌రోవైపు ప్రిన్స్ మ‌హేశ్ కూడా తండ్రికి త‌గ్గ త‌న‌యుడు అనిపించుకుంటున్నాడు. ఇప్ప‌టికే బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాల‌తో ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక ఫ్యాన్ బేస్‌ను సెట్ చేసుకున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి సినిమా కోసం సిద్ధం అవుతున్నారు. 

ఇక ఈ చిత్రంలో మ‌హేశ్ పూర్తి డిఫ‌రెంట్ లుక్‌లో క‌నిపించ‌నున్నాడ‌ని స‌మాచారం. దీనికి త‌గ్గ‌ట్టుగా త‌న శ‌రీర ఆకృతిని మార్చుకునే ప‌నిలో సూప‌ర్ స్టార్ ఉన్నారు. దీనిలో భాగంగా రాజ‌మౌళి సూచ‌న మేర‌కు ఇప్ప‌టికే విదేశాల‌కు కూడా వెళ్లొచ్చారు. కాగా, ఈ సినిమా ఓ అడ్వెంచర్ డ్రామాగా ఉండ‌బోతుంద‌ని ర‌చ‌యిత విజయేంద్రప్ర‌సాద్ ఇప్ప‌టికే వెల్ల‌డించారు.
Advertisement
Mahesh Babu
Birthday Wishes
Super Star Krishna
Tollywood

More Telugu News