అక్కతో మహేశ్ బాబు ఫన్.. వీడియో ఇదిగో!
- రాజమౌళి సినిమా కోసం జుట్టు పెంచిన హీరో
- మహేశ్ బాబు జుట్టుపై ప్రశ్నించిన మంజుల
- ఫ్యామిలీ ఫంక్షన్ లో అక్కాతమ్ముళ్ల సరదా సంభాషణ
సిటీలో జరిగిన ఓ పెళ్లికి మహేశ్ బాబు తన కుటుంబంతో కలిసి వెళ్లాడు. అప్పటికే ఆ వేడుక వద్ద ఉన్న మంజుల తన తమ్ముడికి ఎదురువెళ్లి ఆప్యాయంగా పలకరించింది. ఆపై మహేశ్ బాబు జుట్టును చూసి.. ఇదేంటి, ఇంతలా పెంచేశావన్నట్లు జుట్టును పట్టుకుని చూసింది. రాజమౌళి సినిమా కోసం తప్పట్లేదు.. అన్నట్లు మహేశ్ బాబు బదులివ్వడంతో మంజుల నవ్వాపుకోలేకపోయింది. అక్క నవ్వులో మహేశ్ బాబు కూడా శ్రుతి కలిపాడు. అక్కాతమ్ముళ్లు కాసేపు సరదాగా మాట్లాడుకోవడం వీడియోలో కనిపించింది. ఈ క్యూట్ వీడియో చూస్తూ మహేశ్ బాబు అభిమానులు మురిసిపోతున్నారు.