మత విద్వేషాలను రెచ్చగొట్టేలా పవన్ మాట్లాడుతున్నారు: వంగా గీత
- పిఠాపురంలో పవన్ పై పోటీ చేస్తున్న వంగా గీత
- పిఠాపురంకు పవన్ రౌడీయిజాన్ని అంటకట్టారని విమర్శ
- పార్టీ సమస్యలను పరిష్కరించేందుకు మిథున్ రెడ్డి వస్తుంటారని వ్యాఖ్య
తనను తిడుతున్నారని చెప్పుకుని పవన్ కల్యాణ్ జాలి పొందాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బ్లేడ్లతో దాడి చేస్తున్నారంటూ పిఠాపురం నియోజకవర్గానికి రౌడీయిజాన్ని అంటకట్టారని విమర్శించారు. కడప మనుషులు పిఠాపురంకు వస్తున్నారని అంటున్నారని... ఒక ఏడాది కాలంగా తమ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి అని... నియోజకవర్గ పార్టీ సమస్యలను పరిష్కరించేందుకు ఆయన వచ్చి వెళ్తుంటారని చెప్పారు.