Advertisement

సిగ్గూ శరం లేకుండా ఇంకా చంద్రబాబు కాళ్లు పట్టుకుని తిరుగుతున్నాడు: పవన్ పై వెల్లంపల్లి ఫైర్

Vellampalli fires on Pawan Kalyan
  • జగన్ పథకాల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్న వెల్లంపల్లి 
  • చంద్రబాబు నోరు తెరిస్తే అన్నీ అబద్దాలేనని విమర్శ
  • బీజేపీని పురందేశ్వరి తాకట్టు పెట్టారని వ్యాఖ్య
పార్టీతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క అర్హుడికీ సంక్షేమ పథకాలను అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వర్ల రామయ్య, బుద్దా వెంకన్నకు కూడా సంక్షేమ పథకాలను అందించామని చెప్పారు. గతంలో టీడీపీ జెండా పట్టుకున్న వారికే పథకాలు ఇచ్చేవారని విమర్శించారు. జగన్ అందిస్తున్న పథకాల గురించి మాట్లాడే అర్హత కూడా చంద్రబాబుకు లేదని చెప్పారు. 

రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, శ్రీలంక అయిందని చంద్రబాబు అన్నారని... చంద్రబాబు నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలేనని వెల్లంపల్లి విమర్శించారు. నిజం మాట్లాడితే తల వెయ్యి ముక్కలు అవుతుందనే శాపం చంద్రబాబుకు ఉందని ఎద్దేవా చేశారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. 

సిగ్గూ శరం లేకుండా పవన్ కల్యాణ్ ఇంకా చంద్రబాబు కాళ్లు పట్టుకుని తిరుగుతున్నాడని వెల్లంపల్లి అన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ లను శాశ్వతంగా సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారడానికి చంద్రబాబే కారణమని అన్నారు. రాష్ట్రంలో బీజేపీని పురందేశ్వరి డైరెక్ట్ గా తాకట్టు పెట్టిందని విమర్శించారు. 
Advertisement
Vellampalli Srinivasa Rao
YSRCP
Pawan Kalyan
Janasena
Chandrababu
Telugudesam

More Telugu News