మరో విజయయాత్రకు సిద్ధమవుతున్న వైసీపీ

YCP Planning Third Phase election campaign
  • ఈనెల 27 లేదా 28 తేదీల్లో మరో విడత ప్రచారాన్ని ప్రారంభిస్తామంటున్న వైసీపీ
  • ఎన్నికల ప్రచార కార్యాచరణను రూపొందిస్తున్నామంటున్న పార్టీ ముఖ్యనేతలు
  • ఈ ప్రచార సభల్లోనే ఎన్నికల మేనిఫెస్టో విడుదలకు అవకాశముందన్న వైసీపీ

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే సిద్ధం పేరిట భారీ బహిరంగ సభలు, మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను ముగించిన వైసీపీ తాజాగా మరో విజయ యాత్ర చేయాలని భావిస్తోంది. ఈ నెల 27 లేదా 28 తేదీల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా వైసీపీ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వైసీపీ నేతలు చెప్పారు. 

రానున్న 15 రోజుల్లో 45 నియోజకవర్గాల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రతీ రోజూ రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రల వారీగా ఒక్కోసభ ఉంటుందని వారు వెల్లడించారు. ఈ సభల్లోనే 2024 వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను కూడా విడుదల చేస్తారని ఆ పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు.
Go Back to Shorts
YSRCP
CM Jagan
Election Campaign
Manifesto Release

More Telugu News