Advertisement

ఏపీని పేద‌రికం లేని రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేస్తా: చంద్ర‌బాబు

TDP President Nara Chandrababu Naidu Fire on YS Jagan
  • జ‌గ‌న్ పాల‌న‌లో కుంభ‌కోణాలు త‌ప్ప ఏమీ లేవ‌న్న టీడీపీ అధినేత‌
  • అంద‌రినీ మోసం చేసి ఒక్క‌డే ఉండాల‌నుకునే వ్య‌క్తి జ‌గ‌న్ అని ధ్వ‌జం
  • సంప‌ద సృష్టించ‌డం తెలిసిన పార్టీ టీడీపీ అని పేర్కొన్న‌ చంద్ర‌బాబు
చంద్ర‌బాబు నాయుడు త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా గూడూరులో మహిళ‌ల‌తో ముఖాముఖి కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీని పేద‌రికం లేని రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేస్తాన‌ని అన్నారు. జ‌గ‌న్ పాల‌న‌లో కుంభ‌కోణాలు త‌ప్ప ఏమీ లేవ‌న్నారు. స్కామ్‌లు జ‌రిగితే ప్ర‌జ‌లంతా బానిస‌లుగా ఉండాల్సి వ‌స్తుంద‌ని పేర్కొన్నారు. అంద‌రినీ మోసం చేసి ఒక్క‌డే ఉండాల‌నుకునే వ్య‌క్తి జ‌గ‌న్ అని విమ‌ర్శించారు. దీపం ప‌థ‌కం కింద వంట గ్యాస్ ఇస్తే దాన్ని ఆర్పేశార‌ని దుయ్య‌బ‌ట్టారు. సంప‌ద సృష్టించ‌డం తెలిసిన పార్టీ టీడీపీ అని చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు.
Advertisement
Chandrababu
TDP
YS Jagan
YSRCP
AP Politics

More Telugu News