Rajaiah: కడియంను భూస్థాపితం చేసేవరకు వదిలేదిలేదు.. రేవంత్ రెడ్డీ! ఆయనతో జాగ్రత్త: మీసం మెలేస్తూ రాజయ్య ఆగ్రహం

Rajaiah warns cm Revanth Reddy
షార్ట్స్‌లో చూడండి
ఎమ్మెల్యే కడియం శ్రీహరిని రాజకీయంగా భూస్థాపితం చేసేవరకు వదిలే ప్రసక్తి లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత డాక్టర్ రాజయ్య మీసం మెలేసి... తొడగొట్టి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభయహస్తం అంటున్నారని... కానీ తన పక్కన కడియం శ్రీహరి వంటి భస్మాసురుడిని పెట్టుకున్నాడని.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. శుక్రవారం హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల విస్తృస్థాయి సమావేశంలో మాట్లాడుతూ... నమ్మకద్రోహం చేసిన కడియం అంతు చూస్తానని హెచ్చరించారు.

కడియంకు నిజాయతీ ఉంటే రాజీనామా చేసి రావాలని... ఎన్నికల్లో చూసుకుందామని మీసం మెలేసి, తొడగొట్టి సవాల్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో అందరూ మనిద్దరి కోసమే ఎదురు చూస్తున్నారని... దమ్ముంటే రాజీనామా చేసి రావాలన్నారు. నాకు నేనుగా రాజకీయ ఆత్మహత్య చేసుకునేలా చేసిన దుర్మార్గుడు కడియం అని దుయ్యబట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనను వదిలే ప్రసక్తి లేదన్నారు. ఇప్పుడు తనకు ఉన్న పని అంతా ఆయనను రాజకీయంగా తొక్కుడే అన్నారు. కడియం శ్రీహరి దళితద్రోహి... నమ్మకద్రోహి... డిక్టేటర్... గుంటనక్క అని తీవ్రస్థాయిలో విమర్శించారు.
Go Back to Shorts
Rajaiah
Revanth Reddy
Kadiam Srihari
Lok Sabha Polls

More Telugu News