కొత్త లుక్‌లో మ‌హేశ్ బాబు అదుర్స్‌.. ఫ్యాన్స్ ఫిదా !
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొత్త లుక్‌లో మ‌హేశ్ బాబు అదుర్స్‌.. ఫ్యాన్స్ ఫిదా !

Mahesh Babu New Look Pics goes viral on Social Media
  • రాజ‌మౌళి సినిమా కోసం సూపర్‌స్టార్ మేకోవ‌ర్ 
  • స‌రికొత్త లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చి అభిమానుల‌ను ఫిదా చేసిన ప్రిన్స్ 
  • పొడ‌వాటి జుట్టు, క‌ళ్ల‌ద్దాలు, టోపీతో ఉన్న ర‌గ్గడ్ లుక్‌కు ఫ్యాన్స్‌ స్ట‌న్‌
  • దుబాయ్ నుంచి హైద‌రాబాద్ ఎయిర్‌పోర్టులో దిగిన స‌మ‌యంలో మ‌హేశ్ కొత్త లుక్ రివీల్‌
టాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి సినిమా కోసం సూపర్‌స్టార్ మ‌హేశ్ బాబు పూర్తిగా మేకోవ‌ర్ అయ్యాడు. తాజాగా ప్రిన్స్‌కు సంబంధించిన న్యూస్టిల్స్ బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అందులో మ‌హేశ్ స‌రికొత్త లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చి అభిమానుల‌ను స్ట‌న్ చేశారు. పొడ‌వాటి జుట్టు, క‌ళ్ల‌ద్దాలు, టోపీ ధ‌రించి ఉన్న ర‌గ్గడ్ లుక్ ఫ్యాన్స్‌ను అమితంగా ఆక‌ట్టుకుంటోంది. 

కాగా, ఈ మెగా ప్రాజెక్టు కోసం రాజ‌మౌళి, మ‌హేశ్ బాబు దుబాయ్ వెళ్లిన‌ట్లు స‌మాచారం. అక్క‌డ ఈ సినిమా తాలూకు ప‌నులు ముగించుకుని హైద‌రాబాద్ విమానాశ్ర‌యానికి చేరుకున్నారు. ఆ స‌మ‌యంలో మ‌హేశ్, జ‌క్క‌న్న కెమెరా కంటికి చిక్కారు. 

అప్పుడు తీసిన ఫొటోలు, వీడియోలు బ‌య‌ట‌కు రావ‌డంతో అవి కాస్తా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఇక ఈ మూవీ యాక్ష‌న్ అడ్వెంచ‌ర్‌గా ఉంటుంద‌ని కథా ర‌చ‌యిత విజయేంద్ర‌ప్ర‌సాద్ ఇప్ప‌టికే వెల్ల‌డించారు. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో హాలీవుడ్ టెక్నీషియ‌న్స్ కూడా భాగం కానున్నారు.
Advertisement
Mahesh Babu
New Look Pics
Social Media

More Telugu News