ఉత్కంఠను పెంచుతున్న కంటెంట్ .. 'టెనెంట్'
- 'సత్యం' రాజేశ్ హీరోగా రూపొందిన 'టెనెంట్'
- సస్పెన్స్ తో కూడిన క్రైమ్ థ్రిల్లర్
- ఈ నెల 19వ తేదీన సినిమా విడుదల
- ఆసక్తిని పెంచుతున్న ట్రైలర్
రీసెంటుగా ఈ సినిమా నుంచి వదిలిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. కొత్తగా పెళ్లైన జంట .. వేరు కాపురం .. అందమైన జీవితం. ఎన్నో ఆశలతో ఆ జంట కొత్తకాపురాన్ని మొదలుపెడుతుంది. ఆనందంగా .. అన్యోన్యంగా సాగిపోతున్న వారి జీవితంలోకి అతని వైపు నుంచి మరదలు .. ఆమె వైపు నుంచి ఒక ఫ్రెండ్ ఎంటరవుతారు. ఆ ఇద్దరితో పాటే ఈ దంపతుల మధ్య అపోహలు .. అపార్థాలు మొదలవుతాయి.
అప్పుడు వాళ్లు ఏం చేస్తారు? వాళ్ల జీవితం ఎలాంటి మలుపు తీసుకుంటుంది? అనేది కథ. ఒక వైపున క్రైమ్ .. మరోవైపున సస్పెన్స్ .. ఇంకోవైపున రొమాన్స్ తో కూడిన ఈ సినిమాపై బజ్ పెరుగుతూ వచ్చింది. చూడాలి మరి ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందనేది.