Love Mocktail2: ఆకట్టుకుంటున్న కన్నడ బ్లాక్‌బస్టర్ ‘లవ్ మాక్‌టెయిల్ 2‘లోని ‘నీదేలే నీదేలే జన్మ’ సాంగ్

Nidele Nidele Janma Song From Love Mocktail2 Released
షార్ట్స్‌లో చూడండి
కన్నడ దర్శకుడు, నటుడు డార్లింగ్ కృష్ణ నటించిన ‘లవ్ మాక్‌టెయిల్ 2’ నుంచి తాజాగా విడుదలైన ‘నీదేలే నీదేలే జన్మ’ సాంగ్ ఆకట్టుకునేలా ఉంది. ఈ పాటకు గురుచరణ్ లిరిక్స్ అందించగా సురేంద్రనాథ్ ఆలపించారు. నకుల్ అభయాన్కర్ అందించిన సంగీతం వినసొంపుగా ఉంది. 2020లో వచ్చి సూపర్ డూపర్ హిట్ సొంతం చేసుకున్న రొమాంటిక్ డ్రామా లవ్ మాక్‌టెయిల్‌కు కొనసాగింపుగా వచ్చిన లవ్ మాక్‌టెయిల్ 2 కూడా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.  ఉత్తమ కన్నడ చిత్రంగా అవార్డు దక్కించుకోవడంతోపాటు పలు విభాగాల్లోనూ అవార్డులు సొంతం చేసుకున్న ఈ సినిమాను తెలుగులో కంచికామాక్షి కోల్‌కతా కాళీ క్రియేషన్స్ పతాకంపై విడుదల చేస్తున్నారు. 

ఈ సందర్భంగా నిర్మాత ఆర్ కృష్ణ మాట్లాడుతూ.. కన్నడ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాను వేసవి సెలవుల్లో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చెప్పారు. డార్లింగ్ కృష్ణ నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సంబంధించిన రెండో పాటను నేడు విడుదల చేసినట్టు తెలిపారు. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాకు ఘన విజయం అందిస్తారని ఆకాంక్షించారు. కాగా, ఇందులో డార్లింగ్ కృష్ణ తరపున మిలిన నాగరాజ్ నటించారు. 

Go Back to Shorts
Love Mocktail2
Nidele Nidele Janma
Darling Krishna
Kanchi Kamakshi Kolkata Kali Kreations

More Telugu News