అబ్బా... బీజేపీ కోరితేనే తాను పొత్తుకు ఒప్పుకున్నాడట: చంద్రబాబుపై రోజా సెటైర్లు

Roja satires on Chandrababu comments
  • నిన్న ముస్లింలతో చంద్రబాబు ఇఫ్తార్ విందు
  • రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం కావాలని చంద్రబాబు వెల్లడి
  • అందుకే పొత్తు కుదుర్చుకున్నామని వెల్లడి
  • ఈ రోజు సారు నాలుక మడతపెట్టేశారన్న రోజా 
టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో నిన్న ముస్లింలతో ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రం సహకారం అవసరం... మనమేమీ వెళ్లలేదు, వాళ్లే వచ్చారు కాబట్టి ఈ పొత్తు పెట్టుకున్నాం అని వివరించారు. దీనిపై ఏపీ మంత్రి రోజా విమర్శనాస్త్రాలు సంధించారు. 

"అబ్బా... బీజేపీ కోరితేనే తాను పొత్తుకు ఒప్పుకున్నాడట. కుప్పంలో మైనారిటీ నాయకులతో జరిగిన మీటింగ్ లో చంద్రబాబు ఈ విధంగా సెలవిచ్చారు. నిజానికి బీజేపీతో పొత్తు కోసం దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ తో కలిసి ఢిల్లీలో పడిగాపులు కాసింది అందరికీ తెలుసు. ఈ రోజు సారు నాలిక మడతపెట్టారు. వినేవారు ఉంటే ఎన్ని కథలైనా అల్లుతాడు" అంటూ రోజా ఎద్దేవా చేశారు. 

అంతేకాదు, చంద్రబాబు వ్యాఖ్యల వీడియోను కూడా ఆమె పంచుకున్నారు.
Go Back to Shorts
Roja
Chandrababu
Alliance
YSRCP
TDP
BJP

More Telugu News