దేవుడు శాసించాడు, కేసీఆర్ నిర్మించాడు.. యాదాద్రి ఆలయం ఫొటోతో కవిత ట్వీట్
- యాదగిరి గుట్టలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
- బుధవారం సాయంత్రం గుట్ట పరిసరాల్లో వర్షం
- ఆలయ ఆవరణలో నిలిచిన వర్షపు నీరు
బీఆర్ఎస్ హయాంలో యాదగిరి గుట్టను పునర్మించి, యాదాద్రిగా అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని గుర్తుచేస్తూ కవిత చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బీఆర్ఎస్ అభిమానులు దీనికి పాజిటివ్ గా స్పందిస్తుండగా.. పలువురు గత ప్రభుత్వంపై ఆరోపణలను గుర్తుచేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఓ ట్విట్టర్ యూజర్ స్పందిస్తూ.. ‘ఆలయ ప్రాంగణంలో నీరు నిలిచిందని బాధ పడాలో లేక ఆ వర్షపు నీటిలో ఆలయ ప్రతిబింబం అద్భుతంగా కనిపిస్తోందని సంతోషపడాలో తెలయట్లేదు’ అంటూ కామెంట్ పెట్టారు.