సోనియా, ప్రియాంక గాంధీలు పార్లమెంట్‌కు వెళితే... తెలంగాణ బిడ్డలు వంటింట్లో కూర్చోవాలా?: కవిత ఆగ్రహం
- ఉద్యోగాల్లో మహిళలకు అన్యాయం చేస్తోన్న జీవో నెంబర్ 3ని రద్దు చేయాలని డిమాండ్
- ఆడబిడ్డల ఉద్యోగాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శ్రద్ధ లేదని విమర్శ
- అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఆందోళన చేసే పరిస్థితికి తీసుకు వచ్చారని ఆగ్రహం
సాయంత్రం ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఆడబిడ్డల ఉద్యోగాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శ్రద్ధ లేదని విమర్శించారు. ఉద్యోగాల్లో మహిళలకు అన్యాయం చేస్తోన్న ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఆందోళన చేసే పరిస్థితికి తీసుకు వచ్చారని మండిపడ్డారు. మహిళలకు న్యాయం జరిగే జీవో నెంబర్ 41ను వెంటనే అమలు చేయాలన్నారు.