Kotamreddy Sridhar Reddy: విజయసాయిరెడ్డి 3 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోతారు: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

Vijayasai Reddy will loose with 3 lakh majority says Kotamreddy Sridhar Reddy
షార్ట్స్‌లో చూడండి
నెల్లూరు లోక్ సభ స్థానం నుంచి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... విజయసాయి 3 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోబోతున్నారని జోస్యం చెప్పారు. విజయసాయి నిర్వహించిన నెల్లూరు ఆహ్వాన కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయిందని ఎద్దేవా చేశారు. 

మాజీ మంత్రి అనిల్ యాదవ్ సరసరావుపేటలో ఎంపీగా గెలవలేరని కోటంరెడ్డి చెప్పారు. అనిల్ డూపుల సంఘానికి అధ్యక్షుడని... ఆయనొక నయా బందిపోటు అని అన్నారు. సీటు ఇప్పించిన ఆనం వివేకానందరెడ్డిపైనే అనిల్ తిరగబడ్డాడని... విశ్వాసం లేకుండా ఆయన్నే బెదరించాడని మండపడ్డారు. అనిల్ లెక్కలను ప్రజలే సరి చేస్తారని చెప్పారు. నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంత మెజార్టీతో గెలుస్తారో... నరసరావుపేటలో అంతే మెజార్టీతో అనిల్ ఓడిపోతాడని అన్నారు.
Go Back to Shorts
Kotamreddy Sridhar Reddy
Telugudesam
Vijayasai Reddy
Anil Kumar Yadav
YSRCP

More Telugu News