మెస్సీ అభిమానులకు సీఎం గుడ్ న్యూస్.. 33 వేల మందికి టికెట్ డబ్బులు వాపస్
- మెస్సీ ఈవెంట్ టికెట్ డబ్బుల రిఫండ్‌పై సీఎం సువేందు అధికారి హామీ
- గందరగోళం కారణంగా నష్టపోయిన 33,000 మందికి లబ్ధి
- రాష్ట్ర క్రీడా బడ్జెట్ నుంచి నిధులు కేటాయిస్తామని వెల్లడి
- గత ఏడాది డిసెంబర్‌లో యువభారతి స్టేడియంలో ఈ ఘటన
- రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి రూ. 400 కోట్లు కేటాయించినట్టు ప్రకటన
ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కార్యక్రమానికి హాజరై తీవ్ర నిరాశకు గురైన అభిమానులకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి భారీ ఊరట కల్పించారు. గతేడాది గందరగోళం మధ్య జరిగిన ఈవెంట్‌కు టికెట్లు కొనుగోలు చేసిన సుమారు 33,000 మంది అభిమానులకు వారి డబ్బును తిరిగి చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్ర క్రీడా బడ్జెట్ నుంచి ఈ నిధులను వాపస్ ఇచ్చే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినట్టు సీఎం వెల్లడించారు.
గత ఏడాది డిసెంబర్ 13న కోల్‌కతాలోని యువభారతి స్టేడియంలో లియోనెల్ మెస్సీతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే, నిర్వాహణ లోపాలు, తీవ్ర గందరగోళం కారణంగా రూ.4,000, రూ.6,000 వంటి అధిక ధరలకు టికెట్లు కొనుగోలు చేసిన వేలాది మంది అభిమానులు మెస్సీని సరిగా చూడలేకపోయారు. దీంతో తమ డబ్బును తిరిగి చెల్లించాలని వారు అప్పటి నుంచి డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు వారి డిమాండ్‌పై ప్రభుత్వం స్పందించింది.
హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవం రోజున నబన్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం సువేందు అధికారి ఈ కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "మెస్సీకి భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. వారు రూ.4,000, రూ.6,000 వెచ్చించి టికెట్లు కొన్నారు. ఆ 33,000 మంది క్రీడాభిమానులకు డబ్బు తిరిగి చెల్లించాలన్నది నా కోరిక. ఇప్పటికే అంతర్గతంగా ఈ ప్రక్రియను ప్రారంభించాను. త్వరలోనే దీనిని పూర్తి చేయగలనని ఆశిస్తున్నాను" అని తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో క్రీడారంగ అభివృద్ధికి సంబంధించిన పలు ప్రణాళికలను కూడా ముఖ్యమంత్రి వివరించారు. క్రీడల కోసం రూ.400 కోట్ల బడ్జెట్‌ను కేటాయించామని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మినీ ఇండోర్ స్టేడియంలను నిర్మిస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వం క్రీడా మౌలిక సదుపాయాలను నిర్లక్ష్యం చేసిందని, అథ్లెట్లకు నియామకాలను ఆలస్యం చేసిందని ఆయన విమర్శించారు.