బంగారం కొనేవారికి ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు ఇలా!

Gold Prices in Telugu states today relief for buyers
  • డాలర్ బలపడటమే ధరల తగ్గుదలకు ప్రధాన కారణమంటున్న నిపుణులు
  • హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం రూ.1,58,240
  • వెండి ధర.. కిలో రూ.2.60 లక్షలు
బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఊరటనిచ్చే అంశం. గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు, వచ్చే వారం కూడా ఇదే ధోరణిని కొనసాగించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా డాలర్ బలపడటం, మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో బంగారం ధరలు దిగివస్తున్నాయి.

యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చని సంకేతాలిచ్చిన నేపథ్యంలో డాలర్యూ, ఎస్ బాండ్లకు డిమాండ్ పెరిగింది. ఇది బంగారం, వెండి వంటి విలువైన లోహాలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీని ఫలితంగానే ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.

ఇవాళ‌ ఉదయం నాటికి హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,58,240గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,45,050గా నమోదైంది. కిలో వెండి ధర రూ.2.60 లక్షలుగా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, గుంటూరు వంటి ప్రాంతాల్లోనూ ఇవే ధరలు అమలవుతున్నాయి.

ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి ఇతర మెట్రో నగరాల్లో కూడా ధరలు స్వల్ప వ్యత్యాసాలతో దాదాపు ఇదే స్థాయిలో ఉన్నాయి. అయితే, బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయని, వినియోగదారులు కొనుగోలు చేసే ముందు స్థానిక జ్యూవెలరీ దుకాణాల్లో ధరలను సరిచూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.                                
Advertisement
Gold Prices
Hyderabad
Telangana
Andhra Pradesh
Silver Price
US Federal Reserve

More Telugu News