గతంలో తప్పులు జరిగాయి.. ఇక నా కల, నా లక్ష్యం ఒక్కటే.. బండ్ల గణేశ్ ఎమోషనల్ పోస్ట్

Bandla Ganesh emotional post on past mistakes and his one goal
  • సోషల్ మీడియాలో బండ్ల గణేశ్ ఎమోషనల్ పోస్ట్
  • ఇకపై తన పూర్తి దృష్టి సినిమాలపైనేనని స్పష్టీకరణ
  • గతంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నానని అంగీకారం
  • మంచి చిత్రాలు నిర్మించడమే తన లక్ష్యమన్న నిర్మాత
సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ సోషల్ మీడియాలో చేసిన ఓ భావోద్వేగ పోస్ట్ చేశారు. తన భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత ఇస్తూ, ఇకపై తన పూర్తి దృష్టి సినిమాలపైనే ఉంటుందని ఆయన ప్రకటించారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తన జీవితంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఉండవచ్చని ఈ పోస్టులో అంగీకరించారు. అయితే, కష్టకాలంలో తనకు అండగా నిలిచిన వారిని ఎప్పటికీ మర్చిపోలేనని బండ్ల గణేశ్ పేర్కొన్నారు. అవసరం ఉన్నప్పుడు దగ్గరై, పని పూర్తయ్యాక దూరం పెట్టే మనస్తత్వం తనది కాదని స్పష్టం చేశారు.

మంచి సినిమాలు తీయడం, ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. తన భవిష్యత్ ప్రయాణం పూర్తిగా చిత్ర పరిశ్రమకే అంకితమని ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. ఈ పోస్ట్ చూసిన ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు బండ్ల గణేశ్ తన కెరీర్‌పై స్పష్టమైన సంకేతాలు ఇచ్చారని భావిస్తున్నారు. ఆయన తిరిగి పూర్తిస్థాయిలో చిత్ర నిర్మాణంలోకి రానుండటంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Bandla Ganesh
Bandla Ganesh Emotional Post
Tollywood Producer
Bandla Ganesh Future Films
Telugu Cinema
Bandla Ganesh Social Media Viral

More Telugu News