జూనియర్ ఎన్టీఆర్ ను బయటకు గెంటేసి టీడీపీని ఆక్రమించుకుంటారు: కొడాలి నాని
- సీనియర్ ఎన్టీఆర్ మాదిరి జూనియర్ ఎన్టీఆర్ ను గెంటేస్తారన్న కొడాలి నాని
- లోకేశ్ ను సీఎం చేయడానికి తారక్ పై కుట్రలు చేస్తున్నారని ఆరోపణ
- వైసీపీ రెండోసారి ఘన విజయం సాధించబోతోందని ధీమా
పేద ప్రజలకు సీఎం జగన్ ఎంతో చేస్తున్నారని కొడాలి నాని చెప్పారు. 120 సార్లు బటన్ నొక్కి పేద ప్రజలకు రూ. 2.50 లక్షల కోట్లను సంక్షేమ ఫలాలుగా అందించిన జగన్ కోసం ఈవీఎంలలో ఫ్యాన్ గుర్తుపై నొక్కాలని అన్నారు. ఎంత మంది ఏకమై వచ్చినా జగన్ ను ఓడించలేరని చెప్పారు. వైసీపీ రెండోసారి ఘన విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు.