ఆధార్ మిస్ యూజ్ అయిందంటూ ఫోన్ కాల్.. సాయం పేరుతో స్కామ్
- సైబర్ స్కామ్ బారి నుంచి కొద్దిలో తప్పించుకున్న చెన్నై మహిళ
- జాగ్రత్తలు చెబుతూ సాయం చేస్తానంటూ నమ్మబలికిన స్కామర్
- పోలీసులు వచ్చే వరకూ ఎదురుచూస్తానని చెప్పి తప్పించుకున్న గృహిణి
అయితే, ఈ ఫోన్ కాల్ లో స్కామర్ చెప్పిన వివరాలు తనను ఆశ్చర్యానికి గురిచేశాయని, తన ఆధార్ నెంబర్ తో పాటు ఇతరత్రా ఐడీ వివరాలు చెప్పాడని వివరించారు. అంతేకాదు, స్కామర్ తనకు పంపిన లింక్ లు కూడా అచ్చంగా ఒరిజినల్ బ్యాంకు ఖాతాలను పోలి ఉన్నాయని చెప్పారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మోసపోవడం తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఆధార్ మిస్ యూజ్ చేశారంటూ పోలీసులు వచ్చే వరకూ తాను ఎదురుచూస్తానంటూ ఫోన్ పెట్టేశానని లావణ్య చెప్పారు. ఇలాంటి ఫోన్ కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తూ.. తన సోషల్ మీడియా ఖాతాలో లావణ్య మోహన్ తన అనుభవాన్ని పంచుకున్నారు.