3 కోట్ల ఖర్చు .. 70 కోట్ల వసూళ్లు .. అదే 'ప్రేమలు' మూవీ స్పెషాలిటీ!

Premalu Movie Update
  • ఈ నెల 9న విడుదలైన 'ప్రేమలు'
  • మలయాళంలో రికార్డు స్థాయి వసూళ్లు
  • హైదరాబాద్ లో షూటింగు జరుపుకున్న మూవీ  
  • వచ్చేనెల 8వ తేదీన తెలుగులో రిలీజ్ చేసే ఛాన్స్
  • ఓటీటీ హక్కులను దక్కించుకున్న హాట్ స్టార్ 

మలయాళం సినిమాలు చాలా తక్కువ బడ్జెట్ లో నిర్మితమవుతాయి .. భారీ వసూళ్లను సాధిస్తూ ఉంటాయి. సింపుల్ లైన్ పట్టుకుని వాళ్లు దానిని డెవలప్ చేసే విధానం గొప్పగా ఉంటుంది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ వచ్చిన తరువాత, మలయాళ కంటెంట్ ఎలా ఉంటుందనే ఒక అవగాహన ఆడియన్స్ లో పెరిగింది. దాంతో వాళ్లు మలయాళ సినిమాల పట్ల ఆసక్తిని కనబరుస్తూ వెళుతున్నారు.

అలా ఇప్పుడు అందరూ మాట్లాడుకునే సినిమాగా 'ప్రేమలు' కనిపిస్తోంది. ఈ నెల 9వ తేదీన మలయాళంలో ఈ సినిమా విడుదలైంది. మంచి రెస్పాన్స్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా 15వ తేదీన రిలీజ్ చేశారు. ఈ సినిమా కోసం కేటాయించిన బడ్జెట్ 3 కోట్లు మాత్రమే. ఇంతవరకూ ఈ సినిమా వసూలు చేసింది 70 కోట్లకి పైనే అంటే, కంటెంట్ ఏ రేంజ్ లో కనెక్ట్ అయిందనేది అర్థం చేసుకోవచ్చు. కథ ప్రకారం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరగడం విశేషం.   

తెలుగులో ఈ సినిమా హక్కులను ఎస్.ఎస్. కార్తికేయ సొంతం చేసుకున్నాడు. మార్చి 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఈ సినిమా ఓటీటీ హక్కులను హాట్ స్టార్ వారు దక్కించుకున్నట్టుగా సమాచారం. గిరీశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, నస్లేన్ .. మమిత .. అల్తాఫ్ సలీమ్ .. మీనాక్షి రవీంద్రన్ .. అఖిల భార్గవ్ ప్రధానమైన పాత్రలను పోషించారు.


Go Back to Shorts
Premalu
Naslen
Mamitha
Althaf

More Telugu News