ఎమ్మెల్యే లాస్య నందిత భౌతిక కాయానికి నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎమ్మెల్యే లాస్య నందిత భౌతిక కాయానికి నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy pays homage to Lasya Nanditha
  • అవుటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం
  • ఘటన స్థలిలోనే మృతి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే నందిత
  • నందిత కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి 
హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, లాస్య నందిత భౌతిక కాయానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. తీవ్ర విషాదంలో ఉన్న లాస్య నందిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అటు, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా లాస్య నందిత భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. 

లాస్య నందిత మృతి ఘటనపై కేసు నమోదు

సుల్తాన్ పూర్ వద్ద ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మృతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మృతి ఘటన తమ పోలీస్ స్టేషన్ పరిధిలోనే జరిగిందని పటాన్ చెరు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. పటాన్ చెరు వద్ద ఓఆర్ఆర్ నుంచి వెలుపలికి వచ్చే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వివరించారు.
Advertisement
Lasya Nanditha
Death
Road Accident
Revanth Reddy
Hyderabad
Telangana

More Telugu News