నిన్ను ప్రశ్శించిందని సొంత చెల్లిని కూడా అరెస్ట్ చేయించేంత వరకు వెళ్లావు: సీఎం జగన్ పై ధూళిపాళ్ల విమర్శలు
- మెగా డీఎస్సీ డిమాండ్ తో ఛలో సెక్రటేరియట్ చేపట్టిన ఏపీ కాంగ్రెస్
- షర్మిల తదితరులను అరెస్ట్ చేసిన పోలీసులు
- సీఎం జగన్ ను తప్పుబట్టిన ధూళిపాళ్ల
- నీ కుటుంబానికి ఎంత ద్రోహం చేశావో అర్థమవుతోందంటూ వ్యాఖ్యలు
నిన్ను ప్రశ్నించిన వాళ్లందరినీ అరెస్ట్ చేయించుకుంటూ పోతున్న నువ్వు చివరికి నీ సొంత చెల్లిని కూడా అరెస్ట్ చేయించావు అంటూ ధ్వజమెత్తారు. అధికారం కోసం ఈ రాష్ట్రానికి, నీ కుటుంబానికి ఎంతటి నమ్మకద్రోహం చేశావో దీన్ని బట్టే అర్థమవుతోందని ధూళిపాళ్ల విమర్శించారు. నిన్ను, నీ నయవంచక పాలనను బంగాళాఖాతంలో కలిపేందుకు జనం సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఈ మేరకు షర్మిల అరెస్ట్ వీడియోను కూడా ధూళిపాళ్ల సోషల్ మీడియాలో పంచుకున్నారు.