రోడ్డు ప్రమాదంలో గాయపడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రోడ్డు ప్రమాదంలో గాయపడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత

BRS MLA Lasya Nanditha injured in road accident
  • నల్గొండలో కేసీఆర్ సభకు హాజరైన లాస్య నందిత
  • సభకు హాజరై హైదరాబాద్ తిరిగొస్తుండగా ఘటన
  • నార్కెట్ పల్లి సమీపంలో ఆటోను ఢీకొట్టిన ఎమ్మెల్యే కారు
  • బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత తలకు గాయాలు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఇవాళ నల్గొండలో కేసీఆర్ హాజరైన బీఆర్ఎస్ సభలో లాస్య నందిత కూడా పాల్గొన్నారు. సభ అనంతరం హైదరాబాద్ తిరిగి వస్తుండగా, నార్కెట్ పల్లి సమీపంలోని చెర్లపల్లి వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ఓ ఆటోను ఢీకొట్టింది.  కారు ముందు వైపు కుడి భాగం బాగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత తలకు దెబ్బలు తగిలాయి. ప్రమాదం జరిగిన సమయంలో కారులో లాస్య నందితతో పాటు ఆమె సోదరి, ఇద్దరు భద్రతా సిబ్బంది ఉన్నారు. లాస్య నందిత ఇటీవలి ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు.
Advertisement
Lasya Nanditha
Road Accident
BRS
Telangana

More Telugu News