షర్మిలకు ఆ ఒక్క గుర్తింపు తప్ప మరేమీ లేదు: రోజా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

షర్మిలకు ఆ ఒక్క గుర్తింపు తప్ప మరేమీ లేదు: రోజా

Roja fires on Chandrababu
  • షర్మిల ప్రతి మాట చంద్రబాబు స్క్రిప్ట్ అన్న రోజా
  • చంద్రబాబు కోవర్ట్ రేవంత్ తో పొత్తు పెట్టుకుందని విమర్శ
  • వైఎస్ కూతురు అనే గుర్తింపు తప్ప ఆమెకు మరే గుర్తింపు లేదని ఎద్దేవా
ఏపీలో టైమ్ పాస్ రాజకీయాలు చేయడానికి వచ్చిందంటూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ లను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని... అందుకే జనసేనాని పవన్ కల్యాణ్ ను వీరు రంగంలోకి దించారని చెప్పారు. ఇప్పడు పవన్ కల్యాణ్ మాటలు కూడా వివి విని బోర్ కొట్టడంతో షర్మిలను రంగంలోకి దించారని ఎద్దేవా చేశారు. షర్మిల మాట్లాడుతున్న ప్రతి మాట కూడా చంద్రబాబు స్క్రిప్టేనని అన్నారు. 

చంద్రబాబుకు షర్మిల తన కొడుకు పెళ్లి కార్డు ఇచ్చిందని... వైఎస్సార్ ను పంచలూడదీసి కొడతానన్న పవన్ ఇంటికి కూడా వెళ్లి వెడ్డింగ్ కార్డు ఇచ్చిందని రోజా విమర్శించారు. చంద్రబాబు కోవర్ట్ రేవంత్ రెడ్డితో షర్మిల పొత్తు పెట్టుకుందని అన్నారు. వినేవాడు వెర్రివాడైతే... చెప్పేవాడు షర్మిల అని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ కూతురు అనే గుర్తింపు తప్ప షర్మిలకు మరే గుర్తింపు లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఏది చేసినా దాని వెనుక వ్యక్తిగత స్వార్థం ఉంటుందని రోజా విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం గతంలో కాంగ్రెస్ తో... ఇప్పుడు జనసేన, బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని చెప్పారు. 
Advertisement
Roja
YSRCP
YS Sharmila
Congress

More Telugu News