Advertisement

కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి... పరామర్శించిన సినీ నిర్మాత దిల్ రాజు

Dil Raju meet former CM KCR
  • తమ్ముడు శిరీష్ రెడ్డి తనయుడు ఆశిష్ రెడ్డి వివాహ ఆహ్వాన పత్రిక అందజేత
  • నందినగర్‌లోని కేసీఆర్ నివాసంలో కలిసిన దిల్ రాజు
  • కేసీఆర్‌ను పరామర్శించిన పలువురు రాజకీయ ప్రముఖులు
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు పరామర్శించారు. నందినగర్‌లోని కేసీఆర్ నివాసంలో కలిశారు. అలాగే తన తమ్ముడు శిరీష్ రెడ్డి తనయుడు ఆశిష్ రెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను బీఆర్ఎస్ అధినేతకు అందించారు. 

కేసీఆర్‌ను పరామర్శించిన పలువురు ప్రముఖులు

కేసీఆర్‌ను పలువురు పార్టీ నేతలు, ప్రముఖులు శనివారం నందినగర్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, చిరుమర్తి లింగయ్య, రవీంద్ర నాయక్, ఎమ్మెల్సీ వెంకట్రాం రెడ్డి, పిర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, తదితరులు కలిశారు.
  తాను రాసిన పుస్తకాల ప్రదానం 

తాము రచించిన పుస్తకాలను సీఎం మాజీ సీపీఆర్వో వనం జ్వాలా నర్సింహారావు, సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ కేసీఆర్‌కు అందించారు.
Advertisement
KCR
Dil Raju
BRS

More Telugu News