హైదరాబాద్ నర్సు హత్య కేసులో వీడిన మిస్టరీ.. అత్యాచార యత్నం అడ్డుకోవడంతో హత్య
- హైదరాబాద్‌లో నర్సుది హత్యేనని తేల్చిన పోలీసులు
- అత్యాచార యత్నాన్ని ప్రతిఘటించడంతో గొంతు నులిమి హత్య
- బీహార్‌కు చెందిన సైనావుల్లా అనే వ్యక్తి అరెస్ట్
- నిందితుడికి కఠిన శిక్ష విధించాలని కుటుంబసభ్యుల ఆందోళన
నగరంలోని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 21 ఏళ్ల నర్సు అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీ వీడింది. ఆమెది హత్యేనని పోలీసులు నిర్ధారించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన బీహార్ వాసి సైనావుల్లాను అరెస్ట్ చేశారు. అత్యాచార యత్నాన్ని ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతోనే గొంతు నులిమి హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు.
వివరాల్లోకి వెళితే, కొత్తగూడెం జిల్లాకు చెందిన యువతి ఏడు నెలల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చింది. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. విధుల్లో భాగంగా ఆమె ఆసుపత్రిలోనే కేటాయించిన గదిలో నివసిస్తోంది. శనివారం మధ్యాహ్నం గదిలోకి వెళ్లిన ఆమె ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో ఆసుపత్రి సిబ్బందికి అనుమానం వచ్చింది. వారు తలుపులు విరగ్గొట్టి చూడగా, యువతి నేలపై విగతజీవిగా పడి ఉంది. ఆమె శరీరంపై గాయాలు ఉండటంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ఘటనా స్థలంలోని ఆధారాలను బట్టి ఇది హత్యగా అనుమానించారు. విచారణలో భాగంగా, ఓ రియల్ ఎస్టేట్ సంస్థలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న సైనావుల్లా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో అతను నేరం అంగీకరించాడు. శనివారం మధ్యాహ్నం కిటికీలోంచి నర్సు గదిలోకి దూకి ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించినట్లు తెలిపాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేస్తూ ప్రతిఘటించడంతో, భయపడిపోయి ఆమె గొంతు నులిమి హత్య చేసి పారిపోయినట్లు వివరించాడు.
ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. మృతురాలి కుటుంబసభ్యులతో పాటు కాంగ్రెస్, బీజేపీ నాయకులు పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. నిందితుడిని కఠినంగా శిక్షించి, న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.